విశాఖలో జనవరి 4న జరిగే చలో విశాఖ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం పరవాడ ఫార్మా సిటీలో ఈ సభను విజయవంతం చేయడానికి ర్యాలీ నిర్వహించారు. సిఐటియు 18వ అఖిలభారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్నాయి. 55 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఈ మహాసభలకు వేదిక కానుంది.