అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2021లో మరణించిన చీమల చెల్లయ్య కుటుంబానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అండగా నిలిచారు. మృతి చెందిన హెచ్‌సీ కుమారుడు చీమల చంద్రశేఖర్‌కు కారుణ్య నియామకం కింద జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా ఉద్యోగ అవకాశం కల్పించారు. నియామక ఉత్తర్వులను శుక్రవారం ఎస్పీ స్వయంగా అతనికి అందజేశారు.