అనకాపల్లి;ఉడూరు సమస్యలపై ఆర్డిఓకి ఫిర్యాదు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వీ ఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యులు సి ఎం రమేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు ఆదేశాల మేరకు, ఉడేరు గ్రామానికి చెందిన రైతులు భూ సమస్యలపై ఆర్డీవోకు పిజిఆర్ఎస్ ద్వారా వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, అటల్జీ మండల అధ్యక్షులు కొమనపల్లి సన్యాసిరావు, సంతోషిమాత దేవస్థానం చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, తదితర రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్