అనకాపల్లి మండలం తుమ్మపాలలో మొంథా తుపాను వల్ల నీటమునిగిన పంట పొలాలను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, గంటా శ్రీరాం తదితరులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొథా తుఫాన్ వల్ల జిల్లాలోని వేలాది ఎకరాల పంటలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోయిన వారందరికీ అంచనా కట్టి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.