పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అచ్యుతాపురం పెట్రోల్ బంకు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. కార్యకర్తలు మోటార్ సైకిళ్లను నడిపిస్తూ వినియోగదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం నాయకులు రొంగలి రాము, కూండ్రపు సోమునాయుడు విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.