గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థినికి ఘన సన్మానం

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గాయత్రి జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కనపర్తి ఉమా మహేశ్వరి 1000/985 మార్కులతో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా పెద్ద ఉప్పలం గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆమెకు సల్వా కప్పి, స్వీట్లు తినిపించి ఆదివారం ఘనంగా సన్మానించారు. గ్రామానికి, మండలానికి మంచి పేరు తెచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు సూరిబాబు, చిట్టిమని ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో పినపాత్రుని గణేష్, కందికొండ శ్రీను, పినపాత్రుని సూర్యనారాయణ, విత్తనాల వీర్రాజు, విత్తనాల గణేష్, అమలకంటి గోపి, బండారు బుజ్జి, పంపిన గణేష్, వి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్