అనకాపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ప్రజలను ఉల్లాసపరిచింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం సమయానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వానలో, వడగళ్లు పడటం విశేషం. చాలా కాలం తర్వాత కురిసిన వడగళ్ల వానను స్థానికులు ఎంతో ఆసక్తిగా, ఆహ్లాదంగా తిలకించారు.