మాడుగుల: కరెంట్ షాక్ తో యువకుడు మృతి

డి. గొట్టివాడ గ్రామంలో బొబ్బాది శివాజీ (22) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. గురువారం పొలంలో మోటార్ కు కరెంట్ రావడం లేదని, తీగలకు ఆనుకుని ఉన్న కొమ్మను ఇనుప గొట్టంతో తొలగించే ప్రయత్నంలో తీగలకు తగిలి షాక్ తగిలింది. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్