ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌ను ఆదివారం అనకాపల్లిలోని ఎంవీఆర్ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి, ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తోందని అన్నారు. ప్రధాని పంచుకున్న ఆలోచనలు దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.