అనకాపల్లి మండల పరిధిలో మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం

అనకాపల్లి మండలం సత్యనారాయణపురం, మూలపేట గ్రామాలల్లో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమావేశాలు (పీటీఎం 2. 0) గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా కూటమి గ్రామ ఇన్ ఛార్జ్ కొణతాల సంతోష అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పలక భాగ్య లక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్