ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, రేబాక, అనకాపల్లి నందు డిసెంబర్ 1వ తారీఖున పరవాడలో గల రిఫ్రా టెక్నిక్ కంపెనీలో అప్రెంటిస్ ట్రైనీ పోస్ట్ కి మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి టి. చాముండేశ్వరరావు తెలియజేసారు. ఈ ఇంటర్వ్యూలకు డిప్లొమా ఐ. టి. ఐ చదువుకొని యువకులు పాల్గొనవచ్చు.