బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ తో కలిసి అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీలు (గొల్ల బాబు) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు.