యలమంచిలిలో రూ. 40 లక్షల కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

యలమంచిలి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని రామారాయుడుపాలెం రోడ్డులో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమైనందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్