నక్కపల్లి: బైకు ఢీ.. లారీ డ్రైవర్ మృతి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవర్గానికి చెందిన లారీ డ్రైవర్ మందపాటి ఏసు (46) రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఏసు, బైక్‌పై ఉన్న అమరారాం, శివారాం తీవ్రంగా గాయపడ్డారు. ఏసు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమరారాం పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్