అనకాపల్లి పోలీస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవం

స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం అనకాపల్లిలో జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం. దేవ ప్రసాద్, ఎల్. మోహన రావు తదితరులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించుకున్నారు.

సంబంధిత పోస్ట్