అన‌కాప‌ల్లిలో పెన్ష‌న్లు పంపిణీ

మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమ‌ర‌శెట్టి రాంకీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. 17వ సచివాలయం పరిధిలో దివ్యాంగురాలు మద్దాల కమలకి ఉదయం 6.30 గంటలకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తో జనసేన నాయకులు కాండ్రేగుల ఉమా, దాడి వేణు, దాడి రామగోవిందా, వానపల్లి కోటేశ్వరరావు కూటం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్