అనకాపల్లిలో రైతు బజార్ కోసం రిలే దీక్షలు

అనకాపల్లిలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు బజార్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, 40 శాతం బడ్జెట్ రైతులకే కేటాయించినట్లయితే అనకాపల్లిలో రైతు బజార్ ఎందుకు పెట్టలేదని పార్టీ ప్రశ్నిస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, వారిని కంటతడి పెట్టనివ్వద్దని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది. ఇది దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్