రిపోర్టర్ హత్య: శ్రీగంధం మాఫియాపై వార్తలు రాసినందుకేనా?

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురయ్యారు. శ్రీగంధం మాఫియాపై ఇటీవల ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు కారణమని APUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవింద ఆరోపించారు. హత్య వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్