అనకాపల్లిలో రూ. 28 లక్షల గంజాయి పట్టివేత

అనకాపల్లి జిల్లా బవులవాడ జంక్షన్ వద్ద రూరల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ. 28.20 లక్షల విలువైన 56.40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన రూపేష్ రాజు చిక్నే, ఒడిశాకు చెందిన రాజు అంత్రు అనే ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయితో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎర్టిగా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించగా, ముఠాలోని ఇతర సభ్యుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్