సబ్బవరం: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందినట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. గొటివాడకు చెందిన రైతు గల్లా సూరిబాబు(49) బైకుపై కూరగాయల వేసుకొని సంతకు బయలుదేరాడు. ఈ క్రమంలో చిన్నయ్యపాలెం ఆంజనేయస్వామి ఆలయం వద్ద అతడిని వ్యాన్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సూరిబాబును కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్