అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సోలారైజేషన్ పథకం కింద కొత్తూరు సబ్‌డివిజన్ పరిధిలోని తుమ్మపాల సెక్షన్ గ్రామాల కోసం మంజూరైన నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ జి. ప్రసాదరావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించి, సోలారైజేషన్ ద్వారా గరిష్ట ప్రయోజనం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతో లో-వోల్టేజీ సమస్యలు తొలగి, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు.