రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి కాంతారావు అనకాపల్లి పట్టణంలో గురువారం పలు ప్రాంతాలు సందర్శించారు. ఈ క్రమంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. గాంధీనగర్, తుమ్మపాల, గవరపాలెం, రామజోగిపేట, సాధకమ్మపేట, గౌరీ సంఘం రోడ్డు, పార్క్ సెంటర్, నాగవంశం వీధిలోని రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను పరిశీలించారు.