అనకాపల్లి పట్టణంలో ప్రస్తుతం మండు వేసవిని తలపించేలా వాతావరణం నెలకొంది. వర్షాలతో చల్లబడాల్సిన సమయంలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో, వర్షాకాలంలో ఈ వడగాడ్పులు ఏమిటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జూలై 9: 35 డిగ్రీల సెల్సియస్, జూలై 10: 36 డిగ్రీల సెల్సియస్, జూలై 11: 37.1 డిగ్రీల సెల్సియస్, జూలై 12 (శనివారం): 37.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.