భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎం. పి. కార్యాలయంలో సంత్ రవిదాస్ 649వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ గురు రవిదాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.