వడ్డాది జడ్పీ హైస్కూల్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్డాది నుంచి కొండెంపూడికి వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి హైస్కూల్ సమీపంలో ఉన్న ఒక షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అనకాపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.