న్యూఢిల్లీలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లజన్ జాతీయ కరీమా ఉత్సవంలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశానికి డుంబ్రిగూడకు చెందిన శెట్టి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గిరిజనుల వారసత్వాన్ని కాపాడుతూ ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గొప్ప గౌరవమని, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని శెట్టి శ్రీను తెలిపారు.