గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆదివాసీ జేఏసీ పోరాటం

అల్లూరి జిల్లా అరకు లోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని దేవరపల్లి గ్రామంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక DSC ప్రకటించి, స్థానిక ఆదివాసీలతో ఉద్యోగ భర్తీ చేయాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీకి వచ్చిన నాన్-ట్రైబల్ టీచర్లను వెంటనే వెనక్కి పంపాలని, ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. షెడ్యూల్ ప్రాంతంలో 1/70, LTR, PESA, FRA చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనుల హక్కులు, చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్