అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బిడ్డ ఎరుకులు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామం గుమ్మాలో తీవ్ర విషాదం నెలకొంది. అతని మృతి పట్ల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సంతాపం తెలిపారు. కుటుంబీకులు కంటతడి పెట్టారు.