అరకు పంచాయతీ పరిధిలోని కొండవీధి గ్రామంలో ఐదేళ్లుగా అంగన్‌వాడీ భవనం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. చిన్నారుల సంరక్షణ, గర్భిణులకు పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న ఈ భవనం పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం పూర్తి కాకపోవడంతో అంగన్‌వాడీ సేవలు ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.