డుంబ్రిగుడ మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వెల్పర్లు వేసవి సెలవులు ఇవ్వాలని నిరసన చేపట్టారు. మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రీ-స్కూల్ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సెంటర్లకు రావడం కష్టమవుతోందని, వడదెబ్బ ప్రమాదం ఉన్నందున మే నెలకు టేక్ హోమ్ రేషన్‌తో పాటు సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.