పెదబయలు స్థానిక బాలుర రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి పాతుని చంటిబాబు, జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ మీట్‌లో 800 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ డి. ఎస్. సూర్య శంకరరావు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన సూచించారు.