అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరో ముందడుగు పడింది. డుంబ్రిగూడ మండలం గుంటసిమ్మ పంచాయతీకి చెందిన వైసిపి మాజీ వార్డ్ మెంబర్ పాంగి గాసి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి కొత్త సభ్యులకు కండువాలు కప్పి స్వాగతించారు. గిరిజనులు, బలహీన వర్గాల హక్కులకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.