అనంతగిరి మండలంలోని బొర్రా ట్రైబల్ ట్రాక్స్ యూనియన్ అధ్యక్షుడి ఎన్నికల్లో గరం ప్రేమ్ కుమార్ విజయం సాధించారు. మొత్తం 91 ఓట్లలో గరం ప్రేమ్ కుమార్‌కు 49, డుంబరి శ్యామ్ కుమార్‌కు 42 ఓట్లు వచ్చాయి. ఏడూ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన, యూనియన్ బాధ్యతలు నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానన్నారు. సోమవారం సభ్యులు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.