ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ లో ఈ నెల 3న తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన బంగారు ఆభరణాలు పోలీసులు రికవరీ చేశారు. దొంగతనానికి సంబంధించి సుమారు రూ.3 లక్షల విలువైన నెక్లెస్, ఉంగరం, బ్రాస్లెట్‌లను నిందితుడు సాయికుమార్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.