పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: సుబ్బారావు

ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి. సుబ్బారావు మాట్లాడుతూ, పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. డుంబ్రిగుడ మండలంలోని గుంటగన్నెల పంచాయతీ గ్రామాల్లో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్