అరకులోయ మండలం బొండం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూజారి దామోదర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. పక్షవాతంతో చికిత్స పొందుతున్న ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.