డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు, పైలట్ ఎస్. శ్యాముసుందర్ తెలిపారు. ఈ సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది.