చంపవలసలో తాగునీటి కష్టాలు

డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ పరిధి చంపవలస గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. వైసీపీ నేత చిరంజీవి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ పథకం కింద నిర్మించాల్సిన మంచినీటి ట్యాంకు, సోలార్ ఆధారిత నీటి సరఫరా పనులు పూర్తికాకుండానే గుత్తేదారు, అధికారులు బిల్లులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. దీంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్