డుంబ్రిగుడ: భారీ వర్షానికి కూలిన గోడలు.. ధ్వంసమైన ఇల్లు

డుంబ్రిగుడ మండలంలోని కొర్ర పంచాయతీ పరిధి గొందివలస పరిసర ప్రాంతంలో శుక్రవారం భారీవర్షం కురిసింది. దీంతో గొందివలసలో ఉన్న ప్లాట్ఫారం గోడ విరిగి రెండు పెంకుటిల్లుల మీద పడడంతో గోడలు కూలి పెంకులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో రెండిళ్లల్లో ఉన్న గిరిజనులు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పిందన్నారు. ప్రభుత్వాధికారులే గుర్తించి ఆశ్రయం కోల్పోయిన బాధిత రైతులు గెమ్మేలి. వెంకట్రావు చిన్నపొట్టన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్