ముంచంగిపుట్టు మండలం, జర్జుల పంచాయతీలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మురళి కృష్ణ, కూటమి నాయకులు రైతులతో ముఖాముఖి అయ్యారు. కూటమి ప్రభుత్వం పంచసూత్రాలతో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేస్తుందని తెలిపారు. 90% సబ్సిడీపై రైతులకు మేలైన విత్తనాలు అందిస్తామని, MSP, MIS ద్వారా పంట కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఆధారిత పంటలు వేసి రైతులు లాభపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉప కార్యదర్శి బి రామారావు, తెలుగు యువత ఉప అధ్యక్షులు సూర్య కిల్లో, పంచాయతీ ఎంపీటీసీ శ్రీమతి వి విజయలక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.