అరకులో తెలుగు సినిమా షూటింగ్

అరకు లోయ పరిసర ప్రాంతాల్లో శనివారం ఓ తెలుగు సినిమా షూటింగ్ జరిగింది. రాజన్న, బాహుబలి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అన్నీ, సాత్విక్ వర్మలు ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాను చిత్రికరించారు. అల్లు ఆర్ట్స్ అకాడమీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుండగా, నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ వివరాలను తెలిపారు. ప్రవీణ్ యండమూరి, రవి వర్మలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని దర్శకుడు కృష్ణ ప్రసాద్ యడ్ల పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్