అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం

అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, కొంతిలి గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడి భవనాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గుమ్మ తనుజరాణి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కూడా పాల్గొన్నారు. గతంలో జడ్పిటిసి నిధులతో శంకుస్థాపన చేసిన భవనాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రారంభించడం సంతోషంగా ఉందని మత్స్యలింగం తెలిపారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీలు కీలకమని, ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్