వేసవి సెలవులు ముగియడంతో శుక్రవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలు, హాస్టళ్లకు చేరుకున్నారు. డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హాస్టళ్లలో చేరేందుకు వచ్చిన విద్యార్థులతో బస్టాండ్ ప్రాంతం సందడిగా మారింది.