అరకు పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పార్లమెంట్ పరిశీలకుడు నాగబాబు నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం అరకులోయలోని గుడ్ మార్నింగ్ రిసార్ట్స్‌లో పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగల జనసైనికులు తమ వివరాలతో దరఖాస్తులు సమర్పించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని నాగబాబు తెలిపారు.