పెదబయలు మండలం రూడకోట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో మెగా పేరెంట్స్ డే 2.0 గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కాతారి సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు మంచి చదువుతో ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్య నేర్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థులచే పాదాభివందనం చేయించి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.