మంగళవారం రాత్రి డుంబ్రిగూడ మండలం పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, రాత్రి 7 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. మేఘాలు కమ్ముకుని పలుచోట్ల వర్షం కురవడంతో ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు. ఈ వర్షం వల్ల మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. రైతులు కూడా ఈ వర్షం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.