ప్రతి ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కేబీచ్‌లో జరిగే యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, కమాండో ప్రదర్శనలు ఈ సంవత్సరం జరగడం లేదు. ఫిబ్రవరి 15-25 వరకు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ & మిలాన్-2026 నిర్వహణకు నేవీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నందున, నేవీ డే విన్యాసాలను తిరువనంతపురంలో చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రదర్శనలను చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చేవారు.