మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం డుంబ్రిగూడ మండల నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా టీ. బలరాం, కార్యదర్శిగా హరిబారికి రాజులమ్మ, కోశాధికారిగా జి. రామి, సహాయ కార్యదర్శిగా జి. కేశవరావుతో పాటు 25 మంది సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరిస్తే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.