ముంచంగిపుట్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

ముంచంగిపుట్ మండలం సుజానకోట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ సింహాచలం, బూత్ ఇంచార్జ్ నవీన్ కుమార్, యువ నాయకులు  మనోజ్,మహేష్,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వారు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్