రాజుపాక బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని నిరసన

అనంతగిరి పంచాయతీ పరిధిలోని రాజుపాక బీటీ రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గిరిజనులు నిరసన చేపట్టారు. అడవి తల్లి బాట పథకం కింద రూ. 2.30 కోట్లతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తికాక డెకపురం, పట్క, దౌవడ గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జన్మన్ గృహాల నిర్మాణ సామగ్రి రవాణా కూడా నిలిచిపోయిందని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్